సామాన్యునిపై పెట్రో పిడుగు

పెట్రోలియం ధరలు తగ్గించాలి

 సిపిఐ నేత ధనుంజయ నాయుడు

పాలకవీడు, అక్షిత న్యూస్ :

పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనంజయ నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ దేశంలో కరోనా వల్ల ప్రజలు అనేక ఈతి బాధలు ఎదుర్కొంటుంటే ఆదుకోవాల్సిన పాలకులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి ప్రజలను నానా అవస్థలు పాలు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు అవసరమైన నిత్యజీవితావసర వస్తువుల ధరలు రెండింతలు పెరిగాయని రైతులు పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర లేదని,, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, వ్యవసాయ మోటార్ల కు మీటలు బిగించుకునే ఈ ప్రక్రియను నిలిపివేయాలని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతాంగం ఉద్యమిస్తుంటే దిక్కుతోచని కేంద్ర ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు.. రైతుల ఉద్యమం కేవలం ఒక్క పంజాబ్ రాష్ట్రానికి పరిమితమైన అన్న కేంద్ర ప్రభుత్వం నిన్న జరిగిన రాస్తారోకో దేశవ్యాపితంగా జరిగిందని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడుతున్నదని ఆయన అన్నారు. ఓ పక్క రైతాంగం నడ్డి విరుస్తూనే, మరోపక్క రైతులను ఆదుకుంటామని సూర్యాపేట జిల్లాలో కపట భరోసా యాత్రను చేపట్టడం రైతులు గమనిస్తున్నారని, ముమ్మాటికి కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని, రైతు కంట తడి పెట్టించిన ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం మన కలగలేదని, ఆయన అన్నారు.. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల, ప్రజలపై నేరుగా భారం పడుతోందని, ఇప్పుడు కొత్తగా సబ్సిడీ సిలిండర్ పై కూడా రోజువారీ సమీక్ష చేయాలని కేంద్ర నిర్ణయించడం దుర్మార్గమైన చర్య అని, సిలిండర్లపై సబ్సిడీని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ప్రజలు చైతన్యం కావాలని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్దఎత్తున ఉద్యమాలకు తరలిరావాలని ఆయన కోరారు… ఆయన వెంట పాలకవీడు మండల సిపిఐ కార్యదర్శి ముళ్ళ జానయ్య, గుడ్ కె నాగయ్య, బోయ బోయిన శ్రీనివాస్ ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *