లలితా ఆనంద్ దంపతులకు సత్కారం

సూర్యాపేట పట్టణ అభివృద్ధికి ఆర్యవైశ్యులు సహకరించాలి – ఎంపి బడుగుల లింగయ్య యాదవ్
సూర్యాపేట,అక్షిత బ్యూరో : జిల్లా కేంద్రంలో ఆదివారం నాడు కిరణా& ఫ్యాన్సీ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఉప్పల లలితాదేవి ఆనంద్ లకు జరిగిన ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల ఆనంద్ తండ్రి రామ్మూర్తి కిరాణా మర్చంట్ భవన నిర్మాణం కొరకు సహాయ సహకారాలు అందించారని, ఉప్పల ఆనంద్ కూడ వ్యాపారం రంగంతో పాటు వ్యవసాయంలో రాణించారని అన్నారు. ఇప్పుడు కిరాణ దుకాణాలు వైశ్యులతో పాటు అన్ని కులాల వారు నడుపుతున్నారని, సూర్యాపేటలోవ్యవసాయ  మార్కెట్ పదవి గతంలో ఆర్యవైశ్యులకు ఇవ్వలేదు. మార్కెట్ లో వ్యాపారులు ఆర్యవైశ్యులు ఎక్కువగా వుంటారని వైశ్యులకు ఈ పదవి గతంలో ఇవ్వలేదని అన్నారు. కాని మంత్రి జగదీష్ రెడ్డి వైశ్యులకు న్యాయం చేయాలనే తలంపుతో మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆర్యవైశ్య మహిళకు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం మార్కెట్ లో అన్ని కులాల వారు వ్యాపారం చేస్తున్నారని, ఉప్పల ఆనంద్ కుటుంబం రైతు కుటుంబం కాబట్టి రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాత జాతీయ రహదారి విస్తరణకు గతంలో ఏ నాయకులు కూడా ధైర్యం చేయలేదు. కాని మంత్రి జగదీష్ రెడ్డి విస్తరణకు ముందడుగు వేశారు. దుకాణాలు కోల్పోయిన వారికి మోడల్ మార్కెట్ లో దుకాణం ఇస్తామని హామి ఇవ్వడం జరిగింది. విస్తరణ పనులకు ఆర్యవైశ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజున కిరాణా వ్యాపారస్తుల కు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుండి పోటీ ఎదురవుతుందని, అయినప్పటికీ వ్యాపారస్తులు ఎంతో కష్టపడి ఈ వ్ర్రత్తిలో రాణిస్తున్నారని చెప్పారు. మంత్రి జగదీష్ రెడ్డి చేసే అభివృద్ధి పనులకు ఆర్యవైశ్యులు మద్దతుగా నిలవాలని,మీ ద్వారా సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రచారం కల్పించాలని ఎంపి బడుగుల విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట పట్టణంలో గతంలో వ్యాపారం చెయాలంటె రౌడియిజం, చందాలు, కమీషన్లు ఇవ్వాల్సి వుండేది. కాని ఇప్పుడా పరిస్థితి లేదు. వ్యాపారులు ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి బెదిరింపులు లేకుండా తమ వ్యాపారం చేసుకుంటున్నారని ఎంపి చెప్పారు. సూర్యాపేట జిల్లాలో మెడికల్ కాలేజ్ నిర్మాణంతో పాటుగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం జరుగుతుంది. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన మంచినీటి సరఫరా జరుగుతుంది. అన్ని వర్గాలకు కమ్యూనిటీ భవనాల నిర్మాణం జరుగుతుంది. గతంలో ఏ ఎమ్మెల్యే చేయనంత అభివృద్ధి మంత్రి జగదీష్ రెడ్డి చేస్తున్నారు. వారికి వ్యాపారులు అండగా నిలవాలని ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు బొమిడి లక్ష్మినారాయణ, పెద్దసంఖ్యలో వ్యాపారులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ఉప్పల లలితాదేవి ఆనంద్ దంపతులకు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *