3,137 పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం

ఏపీలో కొలువుల జాతర మొదలైంది. మొత్తంగా 3,137 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటిలో 334 ఎస్సై, ఆర్ఎస్సై, డిప్యూటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ కాగా, కానిస్టేబుల్, ఫైర్‌మెన్, జైలు వార్డర్లు, డ్రైవర్ ఆపరేటర్లు తదితర 2,803 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 12న విడుదల కానుంది. మార్చి 2019 నాటికి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ఏపీ పోలీసు నియామక మండలి లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో సివిల్ ఎస్సై విభాగంలో మహిళలు, పురుషులకు 150 పోస్టులు, ఏఆర్ ఎస్సై విభాగంలో పురుషులు, మహిళలకు 75 పోస్టులు, ఏపీ ఎస్పీ ఆర్‌ఎస్సై విభాగంలో పురుషులకు 75 పోస్టులు, పురుషులకు 10 డిప్యూటీ జైలర్‌ పోస్టులు, మహిళలకు 4 పోస్టులు, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌‌ విభాగంలో పురుషులకు 20 పోస్టులు ఉన్నాయి. ఈ నెల 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. 24న సాయంత్రం ముగుస్తుంది. డిసెంబరు 8 నుంచి 14 వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు slprb.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.
Tags: AP police notification,constable,deputy jailer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *