గడప గడపకు అనందయ్య మందు

గడప గడపకు ఆనందయ్య మందు
పాజిటివ్ వ్యక్తులకు పిఎల్ ఎఫ్
కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : మిర్యాలగూడ పట్టణంలోని 20వ వార్డు లో గడప గడపకు ఆనందయ్య మందును పంపిణి చేస్తున్నట్లు కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని 20వ వార్డులో గడప గడపకు కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందులను కరోనా పాజిటివ్ ఉన్న వారికి మందులను పంపిణి చేశారు. ఈ సందర్బంగా దేశిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ వార్డులో గడప గడపకు కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందును అందించడం జరిగిందని, వార్డులో తిరుగుతున్నప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించి వారికి ఆనందయ్య పిఎల్ ఎఫ్ కరోనా మందు లను వెంటనే అందించామన్నారు. వార్డులలో మేము ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నప్పుడు ప్రజలలో అనూహ్యమైన స్పందన కనబడుతుందని వారి జీవితంలో ఇప్పటివరకు బిఎల్ ఆర్ లాగా సేవ చేసేటటువంటి వ్యక్తిని మేము చూడలేదని ఆయన ఎప్పుడూ ప్రజలకు ఎలాంటి సహాయంఅవసరమవుతుందో దానిని వెంటనే సకాలంలో చేయాలని తపనతో ఉండేటటువంటి సేవాతత్పరుడన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం అందక ప్రైవేట్ హాస్పిటల్స్ లో డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేక కృష్ణపట్నం ఆనందయ్య మందును తెచ్చుకోలేక ఎంతో మంది అభాగ్యుల చనిపోతున్న ఇటువంటి తరుణంలో బిఎల్ ఆర్ సాక్షాత్తు ఒక దేవుడిలా మేము కృష్ణపట్నం వెళ్ళినా కూడా ఆనందయ్యను కలవలేక వారి మందులను తెచ్చుకోలేకపోయామని, అలాంటి ఆనందయ్యను బిఎల్ ఆర్ మిర్యాలగూడకు…. మన వద్దకు తీసుకువచ్చి మనతో మాట్లాడించిన ఘనత మన బిఎల్ ఆర్ కు దక్కుతుందన్నారు. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని ప్రజల నుండి రకరకాల స్పందనలతో ఆనందభాష్పాలతో బిఎల్ ఆర్ ని కొనియాడుతున్నారని, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ఆనందయ్య కరోనా మందును మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల కోసం తీసుకువచ్చారని దానిని దుర్వినియోగం చేసుకోకుండా మీరు తీసుకున్నటువంటి ప్యాకెట్లో మందు ఏమైనా మిగిలితే అది అవసరం ఉన్న వారికి అందజేయాలని ప్రజలను కోరారు. వేలు ఖర్చు పెట్టినా అది అందని వారు చాలామంది ఉన్నారని, అది మనం అందరం గుర్తుంచుకోవాలని అన్నారు. అదేవిధంగా కరోనా పాజిటివ్ ఉన్న వారు 9866007244, 9988995666 నెంబర్లకు మీ కరోనా పాజిటివ్ రిపోర్టులను వాట్స్అప్ ద్వారా తెలియచేస్తే వెంటనే ఆనందయ్య పిఎల్ ఎఫ్ కరోనా మందు మీ ఇంటి వద్దకే వస్తుందన్నారు. ఎవరు కూడా అధైర్య పడవద్దని మనందరి కోసం బిఎల్ ఆర్ బ్రదర్స్ ఉన్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కంచర్ల అనంత రెడ్డి, రవీందర్ రెడ్డి, సముద్రాల మదన్ కుమార్, కాసర్ల రామారావు, నూకల సతీష్ రెడ్డి, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *