అక్షిత ప్రతినిధి, హైదరాబాద్: మహాత్మాగాంధీ కలలు కన్న స్వచ్ఛభారత్ స్వప్నాన్ని సాక్షాత్కారం చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి గాంధీజీ విగ్రహానికి నివాళి అర్పించారు. అహ్మదాబాద్‌లో స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం పాల్గొన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా రూ.150 నాణెంను ప్రధాని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ ప్రపంచ నేతల గౌరవం పొందారన్నారు. ప్రపంచమంతా గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకుంటోందన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఐక్యరాజ్యసమితి పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. గాంధీ స్మారక స్టాంప్‌లు, నాణెలు విడుదల చేశామన్నారు. భారత్ ఇప్పుడు ప్రపంచ శక్తిగా అవతరిస్తోంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్‌వైపు చూస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్ఠ మరింత పెరిగిందన్నారు. బహిరంగ మలవిసర్జనరహిత దేశంగా మారినందుకు సంతోషంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు.
tags : modi, pm, delhi, swacha bharat