ఈ నెల 16న రాష్ట్ర కేబినెట్‌ సమావేశం

దళిత బంధుపై సమగ్ర చర్చ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 16న జరుగనున్నది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగనున్నది. శాసనసభ సమావేశాల నిర్వహణతో పాటు దళితబంధు పైలెట్‌ ప్రాజెక్టు అమలుపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం హుజూరాబాద్‌తో పాటు వాసాలమర్రిలో పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నది. మరో నాలుగు గ్రామాల్లోనూ పైలెట్‌ ప్రాజెక్టును అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం కార్యక్రమం ఉన్నతస్థాయి సమీక్ష సైతం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *