సింగరేణి కార్మికుల సమస్యలకు పరిష్కారo : కె.చంద్రశేఖరరావు

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టంచేశారు. సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో త్వరలోనే ప్రత్యేకంగా సమావేశమై అన్ని విషయాలను చర్చించి పరిష్కార మార్గాలు సూచించాలని సింగరేణి సీఎండి శ్రీధర్‌ను సీఎం ఆదేశించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు బాల్కసుమన్‌, గండ్రవెంకటరమణారెడ్డి, దివాకర్‌రావు, మనమా వెంకటేశ్వర్లు, దుర్గం చిన్నయ్య, సండ్రవెంకట వీరయ్య, రేగ కాంతారావు, హరిప్రియ తదితరులతో సమావేశమయ్యారు. సింగరేణి సీఎండి శ్రీధర్‌, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు కూడా ఈసమావేశంలో పాల్గొన్నారు. సింగరేణి ప్రాంతంలోని సమస్యలను ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వివరించారు. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది మాదిరిగానే 2018-19 ఆర్ధిక సంవత్సరంలో సింగరేణికి వచ్చిన లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరారు.దీనికి సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. గురువారం అసెంబ్లీలో సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించే అంశాన్ని ప్రకటిస్తామని అన్నారు.

 

 

tags : cm kcr, singareni, employes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *