100 మందికి కోవిడ్ వ్యాక్సిన్ కు చేయూత

పుట్టినగడ్డపై మమకారం
సమాజ సేవలో నేను సైతం…..

విదేశాల్లో స్థిరపడినప్పటికీ స్వస్థలంపై మమకారాన్ని చాటిన డాక్టర్

మిర్యాలగూడ లో 100 మందికి రూ.50వేల విలువైన కొవిషీల్డ్ టీకాలు ఉచితంగా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం

ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రంగా శ్రీధర్ చొరవతో సాధ్యమైన బృహత్ కార్యక్రమం

45 ఏండ్లు పైబడినవారంతా టీకా తీసుకోవాలి

రంగా శ్రీధర్

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ పట్టణంలో చదువుకొని అమెరికాలో వైద్య వృత్తి నిర్వర్తిస్తున్న ఓ వైద్యురాలు( వ్యక్తిగత అభ్యర్ధనపై పేరు వెల్లడిపై నిషేధం) తన ఉదారతను చాటుకున్నారు. విదేశాల్లో స్థిరపడినప్పటికీ స్వస్థలమైన మిర్యాలగూడ పై తన మమకారాన్ని చాటుకున్నారు. మానవీయ దృక్పథంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన 100 మందికి ఒక్కొకరికీ రూ.500 చొప్పున ( రెండు డోసులకు కలిపి ) మొత్తం రూ.50,000 ఖర్చుపెట్టి కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు కొవిషీల్డ్ టీకా వేయించేందుకు ముందుకొచ్చారు. ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, సామాజిక సేవాకార్యకర్త, బాల్య మిత్రుడు రంగా శ్రీధర్ నిర్వర్తిస్తున్న సేవా కార్యక్రమాల ప్రేరణతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైద్యురాలు ఫోన్ లైన్ లో తెలిపారు. ఈ సందర్భంగా రంగా శ్రీధర్ మాట్లాడారు.కరోనా కట్టడి కోసం ప్రతీ ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని కోరారు. 45 ఏండ్లు పైబడిన వారంతా కచ్చితంగా టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతున్నదని వైద్య,ఆరోగ్య శాఖ ప్రతిరోజు మనందరినీ అప్రమత్తం చేస్తున్నదని అన్నారు. ఆర్టీపీసీర్ పరీక్షలు, ర్యాపిడ్ టెస్టుల ఫలితం వచ్చే వరకు ఆలస్యమైనట్టైతే..కోవిడ్ లక్షణాలుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. కరోనా రెండో దశలో వైరస్ సోకినవారిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని అన్నారు. అయినప్పటికీ ఆ వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపి ప్రాణాలను క్షణాల్లో తీస్తుందని అన్నారు. కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టయితే నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా ను కట్టడి చేయాలంటే టీకా వేయించుకోవడం తప్పనిసరి అని రంగా శ్రీధర్ తెలిపారు. బ్రిటన్, అమెరికా, ఇజ్రాయెల్,ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలన్నీ టీకాతోనే కరోనా కు చెక్ పెట్టాయని అన్నారు. బ్రిటీషర్లు టీకా తీసుకోవడంతో కోవిడ్ కేసుల సంఖ్య రోజుకు 70వేల నుంచి 2వేలకు తగ్గాయి. అమెరికాలో 80శాతం కేసులు తగ్గాయి. ఇజ్రాయెల్ దేశంలో ఏకంగా మాస్కులు పెట్టుకునే నిబంధనను తొలగించారని అన్నారు. టీకా తీసుకున్న వారి శరీరంలో ప్రతిరక్షకాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కొవిషీల్డ్ మొదటి డోస్ టీకా తీసుకున్నవారంతా 4నుంచి 8వారాల్లో రెండో డోస్ తీసుకోవాలని సూచించారు. వచ్చే నెల నుంచి టీకాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నదని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా నుంచి రక్షణ కలుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని అన్నారు. టీకా తీసుకున్నవారికి కరోనా నుంచి తక్కువగా ముప్పు ఉంటుందని, అప్రమత్తంగా ఉంటే ఈ మహమ్మారి నుంచి స్వీయ సంరక్షణ సాధ్యమని అన్నారు. 45ఏండ్లు పైబడిన వారు కొవిషీల్డ్ టీకాలను ఉచితంగా వేయించుకునేందుకు ఆధార్ కార్డు, వయసు ధ్రువీకరణ పత్రాలను 9985663326 సెల్ నెంబర్ కు వాట్సాప్ లో పంపించి రిజిస్టర్ చేసుకోవాలని రంగా శ్రీధర్ కోరారు. ప్రతీ వయిల్ నుంచి 10మందికి ప్రాధాన్యత క్రమంలో టీకాలు వేయిస్తామని తెలిపారు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన అర్హులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రంగా శ్రీధర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *