rahul

10న కాంగ్రెస్ అనిశ్చితికి తెర

అక్షిత ప్రతినిధి, న్యూఢిల్లీ : దాదాపు రెండు నెలలుగా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంపై కొనసాగుతున్న అనిశ్చితికి వచ్చే వారంలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసీ) ఈనెల 10న న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశమవుతోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేష్) కేసీ వేణుగోపాల్ ఆదివారంనాడు ఓ ట్వీట్‌లో ఈ విషయం తెలిపారు. మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ గత సీడబ్ల్యూసీలో సమావేశంలో రాహుల్ తన రాజీనామా ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనను సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తోసిపుచ్చినప్పటికీ రాహుల్ మాత్రం అదే పట్టుదల కొనసాగిస్తూ వచ్చారు. ఇటీవల అధికారికంగా తన రాజీనామాను ఆయన ప్రకటించడంతో పాటు తన తన ట్విటర్ ఖాతాలోనూ తన పేరు ముందు ఉన్న ‘కాంగ్రెస్ అధ్యక్షుడు’ అనే ట్యాగ్‌ను తొలగించారు. సాధ్యమైనంత త్వరగా సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని తెగేసి చెప్పిన రాహుల్…తన వారసుడిగా ఎవరి పేరును ప్రతిపాదించ లేదు. గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరినీ ఎంపిక చేయవద్దని కూడా ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో వచ్చేవారంలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశం కీలకం కానుంది.
tags : cong, cwc meeting, delhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *