హైదరాబాద్ లో కుండ పోత వర్షం

హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి :రాజధానిలో కుండపోతగా వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఏకధాటిగా వాన పడింది. బుధవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వాన అర్థరాత్రి దాటేవరకు కురుస్తూనే ఉన్నది. దీంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు ప్రవహించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాగోల్‌ పరిధిలోని బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెంటీమీటర్లు, వనస్థలిపురంలో 19.2 సెంటీమీటర్లు, హస్తినాపురంలో 19, భవానీనగర్‌లో 17.9, హయత్‌నగర్‌లో 17.1 సెంటీమీటర్లు, రామంతాపూర్‌లో 17.1 సెంటీమీటర్లు, హబ్సిగూడలో 16.5, నాగోల్‌లో 15.6, ఎల్బీనగర్‌లో 14.9, లింగోజిగూడలో 14.6, ఉప్పల్‌ మారుతినగర్‌లో 13.4 సెంటీమీటర్ల చొప్పున వాన నమోదయ్యింది. అదేవిధంగా దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, నాంపల్లి, బంజారాహిల్స్‌, అమీర్‌పేట, కూకట్‌పల్లిలో వర్షం కురిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *