హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘హ్యాకథాన్’

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్: నగరంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో హోం మంత్రి మహమూద్‌ అలీ చేతుల మీదుగా ‘హ్యాకథాన్’ కార్యక్రమం ప్రారంభమైంది. 36 గంటల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో టెక్నాలజీకి సంబంధించిన సరికొత్త సాఫ్ట్‌వేర్లు, యాప్స్ రూపొందిస్తారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీని వినియోగించుకోవాలనే వినూత్న ఆలోచనతో పోలీసు శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. సైబర్‌ నేరాల నియంత్రణకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఐటీ విద్యార్థులతో హ్యాకథాన్‌ నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ హ్యాకథాన్‌లో భాగంగా ఐటీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులతో కూడిన టీమ్స్.. సైబర్ నేరాలను అరికట్టడానికి ఉపకరించే సరికొత్త సాఫ్ట్‌వేర్స్‌, యాప్స్‌ రూపొందిచనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *