హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఒకటవ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 27లోగా ధరఖాస్తు చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్.
మహబూబాబాద్, అక్షిిిత ప్రతినిధి : జిల్లాలోని ఎస్సీ బాల, బాలికలకు 2021-22 విద్యా సంవత్సరానికి గాను బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు ఒకటవ తరగతిలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఒక ప్రకటనలో కోరారు. ఎస్సీ విద్యార్ధినీ, విద్యార్ధులు 2015 జూన్ 1 నుండి 2016 మే 31 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలని, తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతములో ఒక లక్షా 50 వేలు, పట్టణ ప్రాంతంలో 2 లక్షలకు మించరాదని, నివాస, ఆదాయ ధృవపత్రములు మీ సేవ ద్వారా పొంది జిరాక్స్ కాపీలను ఏదేని గెజిటెడ్ అధికారిచే ధృవీకరించి ధరఖాస్తుకు జతపర్చాలన్నారు. విద్యార్ధినీ, విద్యార్ధులు జనన ధృవీకరణ పత్రాన్ని సంబంధిత మున్సిపల్ కార్పోరేషన్, మున్సిపల్ బోర్డ్, తహసిల్దార్ ద్వారా పొందిన సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని గెజిటెడ్ అధికారిచే ధృవీకరించినది జతచేయాలని, అంతేకాకుండా రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపిలను కూడా దరఖాస్తుకు జతచేయాలని కోరారు. ఒకటవ తరగతి ప్రవేశం కొరకు దరఖాస్తులను సహాయ సాంఘీక సంక్షేమ అధికారి వద్ద నుండి పొంది వారి కార్యాలయంలో ఈ నెల 27 సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలని తెలిపారు. ధరఖాస్తులో విద్యార్ధినీ, విద్యార్ధుల యొక్క తల్లిదండ్రుల చిరునామా, సెల్ నెంబర్ తో సహా పూర్తి వివరాలు ఇవ్వాలని సూచించారు. విద్యార్ధిని, విద్యార్ధుల ఎంపికకు మార్చి 3వ తేదీన సాయంత్రం 4 గంటలకు డ్రా తీయబడునని ఆ ప్రకటనలో జిల్లా కలెక్టర్ తెలిపారు.