హుజూర్‌నగర్‌లో సీఎం సభ రద్దు….

 అక్షిత ప్రతినిధి, సూర్యాపేట : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పాల్గొనే ప్రచార సభ చివరకు వర్షం కారణంగా రద్దయింది. భారీవర్షం కారణంగా హెలికాప్టర్‌కు ఏవియేషన్‌ అధికారులు నిరాకరించారు. ఏవియేషన్‌ అధికారుల సూచనతో సభనురద్దుచేసుకున్నట్టు సమాచారం. గత కొన్నిరోజులుగా హుజూర్‌ నగర్‌ ఎన్నికల ప్రచారం పోటాపోటీగా జరుగుతోంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, టీఆర్‌ఎకస్‌, బిజెపిల మధ్యనే పోటీ నెలకొంది. ఎలాగైనా హుజూర్‌నగర్‌ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలన్నలక్ష్యంతోనే టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తుండగా, తిరిగి ఈస్థానాన్నికాంగ్రెస్‌ నిలబెట్టుకోవాలన్నపట్టుదలతో వుంది. ఇక బిజెపి సైతం ఇక్కడ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సీఎం కేసీఆర్‌ ప్రచారంతో టీఆర్‌ఎస్‌కు మరింత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తున్నారు.కానీ వర్షం కారణంగానే సభనురద్దు చేసుకోవడంతో టీఆర్‌ఎస్‌ వర్గాల్లోకొంత నిరాశ నెలకొంది.

 

tags : hnr, cm kcr, byelections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *