స్థల వివాదం.. హైకోర్టుకు వైసీపీ ఎమ్మెల్యే..

హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పిటిషన్‌..

తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలలో తన ఇంటి నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశిస్తూ తహసీల్దారు జారీచేసిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ రంపచోడవరం వైసీపీ ఎమ్మెల్యే నాగుల పల్లి ధనలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఉదయభాస్కరరావు అనే వ్యక్తి వద్ద 3 సెంట్ల స్థలం కొనుగోలు చేసి గ్రామ పంచాయతీ అనుమతి మేరకు ఇంటి నిర్మాణం ప్రారంభించానని ఆమె పేర్కొన్నారు.

 

అక్షిత ప్రతినిధి, అమరావతి: అయితే ఆ స్థలం వివాదంలో ఉందంటూ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఫోన్‌ ద్వారా మౌఖికంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహశీల్దారు తనకు నోటీసు జారీ చేశారని ధనలక్ష్మి తన పిటిషన్‌లో తెలిపారు. ఆ నోటీసును రద్దు చేయాలని ఆమె అభ్యర్థించారు. పిటిషన్‌లో ప్రతివాదులుగా రాష్ట్ర రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్డీవో, తహసీల్దారు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిలను చేర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *