స్తంభానికి కట్టేసి.. చెప్పులతో కొట్టి..

పొలం గొడవతో మహిళపై ఏడుగురి దాష్టీకం

నిందితుల్లో నలుగురు మహిళలు

అక్షిత ప్రతినిధి, కోహెడ : పొలానికి వెళ్లే విషయమై ఓ మహిళకు, మరో నలుగురికి మధ్య గొడవ తలెత్తింది. మాటామాటా పెరిగింది. నలుగురూ తమ భర్తలకు ఈ విషయాన్ని చెప్పారు. వారు ఆ మహిళను లాక్కెళ్లి ఊర్లో స్తంభానికి కట్టేశారు. చెప్పులతో కొట్టారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లితండాలో జరిగింది. లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన హంస, జ్యోతి, స్వరూప, రమకు పోరెడ్డిపల్లిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. తండాకు చెందిన బాధితురాలు గుగులోత్‌ జ్యోతికి, వీరికి మధ్య పొలానికి వెళ్లే విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం జ్యోతిని లక్ష్మీపూర్‌ తీసుకెళ్లి.. స్తంభానికి కట్టేసి కొట్టారు. గ్రామస్థులు 100కు ఫోన్‌ చేయడంతో కోహెడ్‌ ఎస్సై అక్కడకు చేరుకుని ఆమెను విడిపించి.. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *