సోనియాగాంధీని కలిసిన జేఎంఎం నేత హేమంత్ సోరెన్

అక్షిత ప్రతినిధి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని జేఎంఎం నేత, జార్ఖండ్ సీఎం అభ్యర్థి హేమంత్ సోరెన్ కలిశారు. న్యూఢిల్లీలోని నివాసంలో సోనియాగాంధీతో హేమంత్ సోరెన్ సమావేశమయ్యారు. అనంతరం హేమంత్ సోరెన్ మీడియాతో మాట్లాడుతూ..సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించాను. ప్రమాణ కార్యక్రమానికి రాహుల్ గాంధీ వస్తారని సోనియా హామీనిచ్చారని తెలిపారు. ప్రధాని మోదీతోపాటు హోంమంత్రి అమిత్ షా, ఇతర ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు చెప్పారు.

 

 

 

tags : sonia gandhi, hemanth soren, delhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *