సెర్బియా నటితో హార్దిక్‌ డేటింగ్‌!

అక్షిత ప్రతినిధి, ముంబై: ఇప్పటికే చాలామంది బాలీవుడ్‌ భామలతో ఎఫైర్లు నడిపిన టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఇప్పడు కొత్త ప్రేయసిని వెతుక్కున్నాడట. నటాషా స్టాన్‌కోవిచ్‌ అనే సెర్బియాకు చెందిన నటితో హార్దిక్‌ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. అయితే, గతంలో అమ్మాయిలతో ఎఫైర్లను డేటింగ్‌ వరకే పరిమితం చేసిన హార్దిక్‌.. ఈమారు నటాషాతో సీరియస్‌ ప్రేమాయణం సాగిస్తున్నాడట. ఈ ఏడాది మేలో నటాషాను తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులందరికీ పరిచయం కూడా చేశాడట. విషయం చూస్తుంటే.. నటాషాను త్వరలోనే హార్దిక్‌ పెళ్లి కూడా చేసుకోవచ్చని అతని సన్నిహితులు చెబుతున్నారు. కాగా.. ముంబైలో నివాసముంటున్న నటాషా తొలుత బాలీవుడ్‌లోకి ఐటమ్‌ గర్ల్‌గా అడుగుపెట్టింది. ఇటీవల షారుక్‌ ఖాన్‌, అనుష్క నటించిన జీరో అనే మూవీలో నటాషా ఓ పాత్ర కూడా చేసింది. అన్నట్టు.. హిందీలో ప్రసారమవు తున్న డ్యాన్స్‌ రియాలిటీ టీవీ షో ‘నచ్‌ బలియే’లో పోటీపడుతోన్న నటాషాకు ఓట్లు వేసి గెలిపించా ల్సిందిగా హార్దిక్‌ తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *