సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని…

సీఎం కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మంత్రి హ‌రీష్ రావు పూజ‌లు
సిద్దిపేట, అక్షిత ప్రతినిధి :

ముఖ్య‌మంత్రి కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని సిద్దిపేట ప‌ట్టాభి రామాలయంలో మంత్రి హరీష్ రావు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. ఇది అత్యంత ప్ర‌సిద్ధి చెందిన రామాల‌యం. సిద్దిపేట ఊరు పుట్టిన‌ప్పుడు ఈ ప‌ట్టాభి రామాల‌యం నిర్మించార‌ని పురాణాల్లో చెప్పిన విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్ర‌తి ఏడాది అత్యంత వైభ‌వంగా ఈ ఆల‌యంలో సీతారాముల క‌ల్యాణోత్స‌వం జ‌రుగుతంద‌న్నారు. క‌రోనా కార‌ణంగా ఈ ఏడాది కేవ‌లం అర్చ‌కులు మాత్రమే ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించార‌ని, భ‌క్తుల‌ను అనుమ‌తించ‌లేద‌ని తెలిపారు. రాష్ర్టాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు అన్ని దేవుళ్లు ఆశీర్వాదాలు ఉండాల‌న్నారు. రాష్ర్ట ప్ర‌జ‌ల ఆశీస్సుల‌తో కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకొని ప‌రిపాల‌నా కొన‌సాగించాల‌ని కోరుకుంటూ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించామ‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *