సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం

టీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టో అంశాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకుంటున్నారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి, బొంరాసుపెటలో కేసీఆర్ చిత్రపటానికి టీఆర్‌ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. మునుగోడులో టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు చేసుకున్నారు.

మ్యానిఫెస్టోలో సబ్బండ వర్ణాల అభివృద్ధి, సంక్షేమం కోసం పెట్టిన అంశాలను స్వాగతిస్తూ సిరిసిల్లలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఘనంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ ప్రజామోదమైన మేనిఫెస్టో ప్రకటించడంతో సీఎం చిత్రపటానికి మక్తల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి రాంమోహన్‌రెడ్డి క్షీరాభిషేకం చేశారు.

టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంగా శాలిగౌరారంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట్ మండలంలోని చిన్న రామచర్ల గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలపై ఇల్లందకుంట మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ, రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *