సిసి రోడ్లుకు శంకుస్థాపన  :  శానంపూడి సైదిరెడ్డి

అక్షిత ప్రతినిధి, హుజూర్ నగర్ : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పోనుగోడు గ్రామములో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా వచ్చిన ( 15 లక్షల)రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన సిసి రోడ్లను సర్పంచి జోగు సరోజిని పిచ్చిరెడ్డి తో కలిసి తెరాస నియోజకవర్గ ఇంఛార్జి శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు బాగుంటాయని అన్నారు. పోనుగొడులో బ్రిడ్జి లు, మిగతా ఏమైనా సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.ఈ సారి అందరూ కలిసి కట్టుగా పనిచేసి ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.గ్రామాలలో ఉన్న సమస్యలపై అందరూ కూర్చొని మాట్లాడుకొని గ్రామ అభివృద్ధికి కృషి చేసుకోవాలని సూచించారు..మీకు ఎప్పుడు అందుబాటు లో ఉంటానని అభివృద్ధి కార్యక్రమాల్లో తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈసారి జరిగే ఎన్నికలు చాలా ముఖ్యమైనవని గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుజాత శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ రమణారెడ్డి, ఎంపీటీసీ – 1 రాం మల్లమ్మ, ఎంపిటిసి – 2
మెళ్ళ చెరువు వెంకటరమణ, తెరాస నియోజకవర్గ నాయకులు జోగు అరవింద్ రెడ్డి, మండల హడక్ కమిటి సభ్యులు రాం సైదులు,సీనియర్ నాయకులు అందే కోటయ్య, కటికం గోపయ్య, సుందరి బసవయ్య, చామకూరి అంజి,కటకం గోపయ్య, సుందరి బసవయ్య, బిల్లా సత్యనారాయణ, ఎడిపాల సత్యనారాయణ రెడ్డి,జోగు రవీందర్ రెడ్డి, చామకూరి అంజి దొంతిరెడ్డి మధుసూధన్ రెడ్డి, బత్తిని సైదులు,ఏసి రెడ్డి నాగిరెడ్డి,అనంతు చంద్రయ్యగౌడ్, జోగు వీరారెడ్డి, వార్డు మెంబర్లు పోకల వెంకటయ్య, బంటు సరిత సైదులు,  చందా మౌనిక సైదిరెడ్డి, నాయకులు సజ్జల ఆదిరెడ్డి,  ఏపూరి వినోద్, ఎసిరెడ్డి నాగిరెడ్డి, యల్లవులా పిచ్చయ్య, బుచ్చిరెడ్డి, నందిపాటి భాస్కర్,నాగిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

tags : road, trs, shanamapudi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *