అక్షిత ప్రతినిధి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో భారీగా అక్రమబంగారం, నగదును డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ఓ ఆసుపత్రి వద్ద ఆగిఉన్న కారులో 40 బంగారు బిస్కెట్లను డీఆర్ఐ అధికారులు గుర్తించారు. వీటి బరువు 4కిలోలు ఉందని… విలువ రూ.1.95కోట్లు ఉంటుందని అధికారులు తేల్చారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, మరో రెండు కోట్ల నగదు చూపించారు. అక్రమ బంగారం విక్రయించగా వచ్చిన నగదుగా అధికారులు గుర్తించారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించగా.. కోల్‌కతా నుంచి మైసూర్ మీదుగా హైదరాబాద్‌కు బంగారం తరలించినట్లు నిందితులు అంగీకరించారు. పట్టుబడిన ముగ్గరూ హైదరాబాద్ వాసులు కావడం గమనార్హం. బంగారం విదేశాల నుంచి తీసుకొచ్చి ఎవరికి విక్రయిస్తున్నారనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
