సాహోలో ఛాన్స్ మిస్ చేసుకున్న కాజ‌ల్‌..!

అక్షిత ప్రతినిధిహైదరాబాద్‌ :  మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సాహో చిత్రం హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. హై బ‌డ్జెట్‌, భారీ కాస్టింగ్‌తో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలంక‌న్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్పెష‌ల్ సాంగ్ చేసింది. ఇటీవ‌ల సాంగ్ ప్రోమో కూడా విడుద‌ల చేశారు. దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ముందుగా కాజ‌ల్‌ని స్పెష‌ల్ సాంగ్ కోసం సంప్ర‌దించార‌ట‌. ఆమె రెండు కోట్ల రెమ్యున‌రేష‌న్ డిమాండ్‌ చేయ‌డంతో చిత్ర బృందం కాజ‌ల్ స్థానంలో జాక్వెలిన్‌ని తీసుకున్నట్టు స‌మాచారం. కాజ‌ల్ జ‌న‌తా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్‌తో స్పెష‌ల్ సాంగ్ చేసిన విష‌యం తెలిసిందే.

కాజ‌ల్ న‌టించిన కోమ‌లి, రణ‌రంగం చిత్రాలు ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు రాగా, వీటికి మంచి ప్ర‌జాద‌ర‌ణ ల‌భించింది. ఆమె న‌టించిన‌ `పారిస్ పారిస్` కూడా విజయం సాధిస్తుందని కాజల్ ధీమాగా ఉంది. మరోవైపు కమల్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం `భారతీయుడు2`లో నటిస్తోంది. ఇదీ కాక శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సూర్యతో జ‌త‌క‌ట్ట‌నుంది కాజ‌ల్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *