సాగర్ లో ‘మహా జన చైతన్యం

ఊరూవాడా విస్త్రత ప్రచారం
వంద రోజులుగా మంద కృష్ణ మకాం
హాలియా, అక్షిత ప్రతినిధి : సాగర్‌లో ‘మహా’ జన చైతన్యం వెల్లివిరిస్తోంది. ఊరూవాడా, పల్లె పల్లె అంతా ఒక్కటయ్యాయి. మహాజనులంతా ఓక్కటయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలను ఏకం చేసేందుకు మహాజన సోషలిస్ట్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ వంద రోజుల క్రితం నుంచే సాగర్‌లో మకాం వేశారు. అన్ని వర్గాలు, కులాలను జాగృతం చేస్తూ తనదైన శైలిలో ఎన్నికను ఎదుర్కొంటుండ్రు. నూతన ఒరవడి, నూతన పంథాతో సాగర్‌ ఉప ఎన్నికల పోరులో మహాజన సోషలిస్ట్‌ పార్టీ నుంచి సాగర్‌ నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర మండం వెల్మగూడెంకు చెందిన ఆడేపు నాగార్జునను బరిలో నిలిపింది. నాగార్జున సైతం తొలి నాళ్ల నుంచి ఎంఆర్‌పియస్‌ వ్యవస్థాపక అధ్యక్షు మంద కృష్ణ మాదిగకు అనుంగు అనుచరుడుగా ఉద్యమంలో క్రియాశీలక భూమిక పోషిస్తుoడ్రు. యువనేత నాగార్జునను ఎంఎస్‌పి అభ్యర్దిగా బరిలో నిలిపింది. ఎన్నికలంటే …ఇంకా …ఉప పోరు అంటే మహా భయం. అన్ని అస్త్ర, సశ్రాలన్ని వినియోగిస్తరు. అధికార, అండ బలంతో అన్ని వింగులను ఏకం చేస్తూ అధికార టిఆర్‌ఎస్‌ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గులాబీ శ్రేణును రంగంలోకి దించి సామా, దాన, దండోపాయాలతో తమ స్థానాన్ని పదిలపర్చుకునేందుకు ఎత్తులకు జిత్తులు వేస్తుండగా, కాంగ్రెస్‌ కురువృద్దుడు, సుదీర్గకాల మంత్రి పదువులను అధిష్టించిన కుందూరు జానారెడ్డి కాంగ్రెస్‌ నుంచి ఎన్నిక సంగ్రామంలోకి దిగారు. అప్పటి వరకు బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్‌రెడ్డి సతీమణి నివేదితరెడ్డి టిక్కెట్‌ ఆశించగా, అధిష్టానం డాక్టర్‌ రవినాయక్‌కు టిక్కెట్‌ కేటాయించి రంగంలోకి దింపింది. ముక్కోణం పోటీ అంటున్నప్పటికి అనూహ్యంగా ఎంఎస్‌పి అభ్యర్ది ఆడెపు నాగార్జున గట్టిపోటీ ఇస్తుండ్రు. బీజేపి అభ్యర్ధి కంటే మెరుగ్గా ఎంఎస్ పి అభ్యర్ధి ఆడేపు నాగార్జునకు మంచి ఆదరణ లభిస్తుంది. ఎంఎస్‌పి అధినేత మంద కృష్ణ మాదిగ సామాజిక అంశాపై సుదీర్ఘకాల పోరాటాలు కలిసి వస్తాయని అంచనా వేస్తుండ్రు. మంద కృష్ణ రిజర్వేషన్ల ఉద్యమ ప్రస్తానంతో పాటు పు సామాజిక అంశాను పరిగణలోకి తీసుకుని ఉద్యమించాడు. మంద కృష్ణ సాగించిన పోరాటా ఫలితంగానే వికలాంగు పెన్షన్‌, గుండె జబ్బు, ఆరోగ్య శ్రీలాంటి అనేక పథకాకు నాంధి ప్రస్తావనయ్యారు. నాటి నుంచి సామాజిక నేపధ్యం కల్గిన అంశాకు సంబంధించి ఆయా సమస్యను పరిష్కరించేందుకు ఎంతటి పోరుకు మంద కృష్ణ మాదిగ పోరు సలిపిన విషయం విధితమే. తెంగాణ ఉద్యమ ప్రస్థావనంలో ఎంఆర్‌పియస్‌ వ్యవస్థాపక అధ్యక్షు మంద కృష్ణ మాదిగ క్రియాశీక భూమిక పోషించిన విషయం విదితమే. నాటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కేసీఆర్‌కు నాడు చావుకోరల్లోకి వెళ్లిన సందర్బంలోనూ నిమ్మరసమివ్వడంతో పాటు ఉద్యమానికి జవజీవాల్ని ఊదిన నేతగా మంద కృష్ణకు పేరుంది. ఎస్సీవర్గీకరణ సాధన ఉద్యమాన్ని గత పాతికేళ్లకు పైగానే సాగిస్తున్నప్పటికి ఆయా ఉద్యమ స్పూర్తి బడుగులందరికి ఊతమిచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. బడుగు, బలహీనవర్గాల ప్రజలంతా మంద కృష్ణ సాగించిన ఉద్యమ నేపధ్యానికి అనుగుణంగా అనేక ఉద్యమాలకు పురిగొల్పింది. మంద కృష్ణ ఉద్యమాల ఫలితంగానే ఎస్సీ, బీసీ వర్గాలు ఆత్మ గౌరవ పతాకగా తమ పేరు చివరన ఆయా కులాలు ప్రస్పుటిoచేలా నామా దేయాలు వ్యక్త పరుస్తున్నయి. సాగర్ ఉప ఎన్నికల బరిలో నువ్వా… నేనా? అన్నట్లు… ఢీ అంటే ఢీ అన్న తరహాలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ కు ధీటుగానే మహాజన సోషలిస్ట్ పార్టీ ప్రచార పర్వంలో తలమునకలైంది. ప్రచార సామగ్రిని సమకూర్చుకొని … ఎన్నికల గుర్తుగా… ఎన్నికల సంఘం కేటాయించిన ట్రాక్టర్ తోనే ప్రచారం సాగిస్తుండ్రు. మంద కృష్ణ మాదిగ తో పాటుగా మహా జన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్, సాగర్ అసెంబ్లీ అభ్యర్థి ఆడేపు నాగార్జునతో పాటు గా ఎమ్మార్పీస్ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు రాగాటి సత్యం మాదిగ, తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, మంద కుమార్ మాదిగలు ప్రచార పర్వంలో తలమునకలయ్యారు. సాగర్ నియోజకవర్గ పరిధిలోని రెండు మున్సిపాలిటీలు, ఆరు మండలాల్లోనూ వ్యూహాత్మకంగా ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం సాగిస్తుండ్రు. మహా జన బిడ్డగా నన్ను ఆదరించి… అక్కున చేర్చుకోవాలంటూ ఆడేపు నాగార్జున ఓటర్లను అభ్యర్థిస్తుండ్రు. సాగర్ నియోజక వర్గంలో 2,10,294 మంది 9టర్లున్నారు. ఇందులో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా వెనుకబడిన తరగతుల వారి ఓట్లు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో బీసీ ఓటర్ల సంఖ్య లక్షా 5 వేల 495 మంది ఉన్నారు. వీరిలో యాదవ ఓటర్ల సంఖ్య 34 వేల 267. బీసీ ఓటర్లలో 2 వ స్థానంలో ముదిరాజుల ఓట్లు 12 వేల 721, 3 వ స్థానంలో గౌడ కులస్తులు ఓట్లు 9 వేల 948 ఉన్నారు. ఇక ముస్లిం మైనార్టీల ఓట్లు 8 వేల 115, రజక సామాజికవర్గం ఓట్లు 7 వేల 896, మున్నూరు కాపుల ఓట్లు 6 వేల 515, కమ్మరి, వడ్ల కులస్తులు 5 వేల 328, కుమ్మరులు 5 వేల 258, వడ్డెరలు 5 వేల 557, పద్మశాలీలు 2 వేల 172, పెరిక కులస్తులు 2 వేల 889, నాయీ బ్రాహ్మణ కులస్తులు 2 వేల 291, బలిజలు 1,164, కంసాలిలు 828, మేర కులస్తులు 546 మంది ఉన్నారు.
కాగా నియోజకవర్గంలో మొత్తం ఎస్సీ ఓటర్ల సంఖ్య 37 వేల 671 మంది. వీళ్ళలో మాదిగలు 26 వేల 204, మాలలు 9 వేల 698, బైండ్ల కులస్తులు 617, దాసరులు 669, బుడగ జంగాలు 483 మంది ఉన్నారు. ఇక ఎస్టీల సంఖ్య 40 వేల 398. అందులో లంబాడీలు 38 వేల 332 మంది, ఎరుకలులు 2వేల 66 మంది ఉన్నారు.నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం ఓసీ ఓటర్ల సంఖ్య 31 వేల 385. ఇందులో రెడ్లు అధికంగా 23 వేల 472 మంది ఉన్నారు. వైశ్యులు 3 వేల 517 మంది, కమ్మ కులస్తులు 2 వేల 736 మంది, వెలమలు పన్నెండు వందల 72 మంది, బ్రాహ్మణులు 334 మంది, కరణాలు154 మంది ఉన్నారు. అత్యధిక శాతం ఓటర్లుగా మహజనులున్నా పిడికెడు మంది ఉన్న వారి చేతుల్లోనే రాజ్యాధికారం వుంటుంది. మహజనులంతా ఏకమై తమ సత్తా చాటుకునేందుకు కార్యోన్ముఖులను కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *