సమస్యల అవగాహనకై పాదయాత్ర

రేణుకా ఎల్లమ్మ కాలనీ సమస్యలను పరిష్కరిస్తా
బాచుపల్లి కార్పొరేటర్ కొలను వీరేందర్రెడ్డి
నిజాంపేట్, అక్షిత ప్రతినిధి :

రేణుకా ఎల్లమ్మ కాలనీ సమస్యలను పరిష్కరిస్తానని బాచుపల్లి కార్పొరేటర్ కొలను వీరేందర్ రెడ్డి తెలిపారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 18వ డివిజన్ లో గల రేణుకా ఎల్లమ్మ కాలనీలో బుదవారం కార్పొరేటర్ కొలను స్థానిక సమస్యలపై పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. స్థానికుల విన్నపం మేరకు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి రేణుకా ఎల్లమ్మ కాలనీ సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ ను చక్కదిద్దాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *