సతీష్ ప్రభుకు… ప్రెసిడెంట్ పోలీస్ మెడల్

అజిత్ దోవల్ చేతుల మీదుగా ప్రధానం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : తెలంగాణకు చెందిన సిబిఐ ఇన్స్పెక్టర్ బి.సతీష్ ప్రభుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందించింది. న్యూ ఢిల్లీలో బుధవారం సిబిఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ భద్రత సలహాదారుడు అజిత్ దోవల్ ఈ అవార్డును సతీష్ ప్రభుకు బహుకరించారు. సతీష్ ప్రభు సిబిఐ లోనూ, గతంలో పని చేసిన ఆర్.పి.ఎఫ్. లోనూ అనేక సంచలన కేసులను పరిశోధించి, నిందితులకు శిక్ష పడేలా చేయడంతో ఆయనకు అత్యున్నత అవార్డు లభించింది. గతంలో సిబిఐ విచారణాధికారిగా సంచలనం సృష్టించిన అబూ సలేమ్ -మోనికా బేడి కేసును సతీష్ ప్రభు చేదించారు. ఇన్ కంట్యాక్స్ చీఫ్ కమీషనర్, సెంట్రల్ ఇన్ కంట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ భాగస్వాములపైన అవినీతి కేసులను కూడా పట్టుకుని సక్ష్యాధారాలతో సహా నిరూపించారు. గౌతమి ఎక్స్ ప్రెస్ కుట్ర కేసును అంతర్రాష్ట్ర గంజాయి కేసుల్లో కూడా సమర్థవంతంగా పని చేసి పలు అవార్డులు అందుకున్నారు. నీరు పరిశోధనలో సతీష్ ప్రభు చూపిన సమర్ధతకు 2012లో ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ కూడా లభించింది. సతీష్ ప్రభును పలువురు సిబిఐ అధికారులు ఘనంగా సత్కరించారు. సిబిఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇతర ఉనతాధికారులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *