సంక్షోభంలోనూ ఆగని సంక్షేమం

పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం 
 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పేదలకు ఆసరా
ప్రగతి పథంలో తెలంగాణ రాష్ట్రం                    59 మంది లబ్ధిదారులకు రూ.59లక్షల విలువైన చెక్కులు   

భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాంటి సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. కళ్యాణలక్షీ, షాదీముబారక్ పథకాలు పేదలకు ఆసరాగా నిలుస్తున్నాయన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో వేములపల్లి మండలానికి చెందిన 59మంది లబ్ధిదారులకు రూ.59,06,844 విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను భాస్కర్ రావు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని అన్నారు. పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామగా, అన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిళ్ల భారాన్ని తగ్గిస్తున్నారని ఆయన అన్నారు. ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని అన్నారు. ప్రతీ పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా 1,00,116 /- ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ సర్కార్ అని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయలేదని…కేవలం టీఆర్ఎస్ సర్కార్ మాత్రమే అమలు చేస్తున్నదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవం, కేసీఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెండ్లి చేసేవరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా కేసీఆర్ నిలిచారని అన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఇరుగు మంగమ్మ, ఎంపీటీసీ నంద్యాల శ్రీరామ్ రెడ్డి, గడ్డం రాములమ్మ,వెంకన్న, సర్పంచులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, చిర్ర మల్లయ్య యాదవ్,దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి,బత్తుల నాగలక్ష్మీ, దేశిరెడ్డి ఈశ్వర్ రెడ్డి,చెరుకుపల్లి కృష్ణవేణి, అంకెపాల రాజు,అనిరెడ్డి నాగలక్ష్మీ,మజ్జిగపు పద్మ సుధాకర్, నాయకులు కృపాకర్ రావు, గోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *