సంక్షేమ హాస్టళ్లను సద్వినియోగం చేసుకోవాలి: వరంగల్ రూరల్ జిల్లా ఆర్డిఓ మహేందర్ జీ

అక్షత న్యూస్, పర్వతగిరి: సంక్షేమ హాస్టలు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ రూరల్ జిల్లా ఆర్టిఓ మహేందర్ రెడ్డి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ లో ఆయన ఒక రోజు నిద్ర చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో చదువుకున్నవాడినేనని, అవకాశాలను వినియోగించుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానం కు చేరుకోవచ్చని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తుందని విద్యార్థులు క్రమశిక్షణ తో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. వసతి గృహంలో ఉన్న విద్యుత్, త్రాగునీరు, మెష్ డోర్ లు వంటి సమస్యలపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. విద్యార్థులతో హాస్టల్లో నిద్రించడం మంచి అనుభూతి అని తన పాఠశాల రోజులు గుర్తుకొచ్చాయని ఆర్ డి ఓ తెలిపారు. హాస్టల్ లో నిద్రించిన వారిలో ఆర్డీవో తో పాటు రెవిన్యూ ఇన్స్పెక్టర్ వల్లాల సత్యం, వీఆర్వో రాపాక యాదగిరి, వీఆర్ఏ శంకర్, హాస్టల్ వార్డెన్ సురేష్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *