సంక్షేమ పథకాల కోసం రూ.45వేల కోట్లు ఖర్చు చేశాం:కేటీఆర్

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. నాలుగేళ్లలో రాష్ట్ర వృద్ధిరేటు 17శాతంగా నమోదైందని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం రూ.45వేల కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ సోషల్ స్టడీస్‌లో సమీకృత అభివృద్ధి, సమస్యలు, సవాళ్లు అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సెస్ ఛైర్మన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది.రాధాకృష్ణ రచించిన ఇండియన్ ఎకానమీ పుస్తకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుబంధు పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని వివరించారు. ప్రజల సంక్షేమమే నిజమైన అభివృద్ధి అని కేటీఆర్ వివరించారు. సామాజిక వృద్ధిలో భాగంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు పథకాలు తీసుకొచ్చాం. తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *