సంకల్ప సభకు తల్లి…వైఎస్ విజయలక్ష్మి

హైదరాబాద్‌,  అక్షిత ప్రతినిధి : ఈ నెల 9న కోవిడ్‌ నిబంధనల ప్రకారం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్‌లో వైఎస్ షర్మిల సంకల్ప సభ నిర్వహిస్తున్నారు. లోటస్‌పాండ్‌ నుంచి ఖమ్మంకు షర్మిల ర్యాలీగా వెళ్లనున్నారు. అయితే సంకల్ప సభకు తల్లి హోదాలో వైఎస్ విజయలక్ష్మి హాజరవుతారని షర్మిల అనుచరులు చెబుతున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని స్థాపించాలని షర్మిల పట్టుదలతో ఉంది. అందుకు ఆమె ఓ రాజకీయ వేదికను కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ఎల్లుండి ఖమ్మంలో సభ నుంచి పార్టీ పేరును ప్రకటించనున్నారు. అయితే షర్మిలకు ఆశీస్సులు ఇవ్వడానికే విజయమ్మ వస్తున్నారని చెబుతున్నారు. అయితే షర్మిల సభకు ఆమె అనుచరులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. షర్మిల హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. దారి పోడవునా ఆమెను ఘన స్వాగతం పలికేందుకు ఆమె సన్నిహితులు ఏర్పాట్లు చేస్తున్నారు. దారి పొడువునా 6 చోట్ల షర్మిల కు ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ హక్కులు సాధించేందుకు షర్మిల ముందుకు వస్తోందని షర్మిల పార్టీ అనుచరులు పిట్టా రాంరెడ్డి, ఇందిర శోభన్ తెలిపారు. ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్‌లో షర్మిల లక్షమందితో తొలిసభ నిర్వహించాలని షర్మిల భావించింది. రాష్ట్రంలో రాజన్న రాజ్యం సాధనే లక్ష్యంగా ఆమె పెట్టబోతున్న కొత్తపార్టీ పేరు, పార్టీ గుర్తు, జెండా, పార్టీ నియమావళి, సిద్ధాంతాలను ఈ సభలోనే ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. తెలంగాణలో జరిగే తొలిసభకు ఖమ్మం వేదిక అవుతున్న నేపథ్యంలో ఖమ్మం లో సభ నిర్వహణకు గాను అనుమతికోసం ఆ పార్టీ నేతలు ఖమ్మం నగర పోలీసు కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌కు దరఖాస్తు చేశారు. అయితే కొవిడ్‌ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ సభ జరుపుకొనేలా పోలీసు శాఖ అనుమతిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *