షూటింగులో జాయినైన చైతూ .. సమంత

శివ నిర్వాణ నెక్స్ట్ మూవీ మొదలు
చైతూ సరసన సమంత
భార్యాభర్తల నేపథ్యంలో సాగే కథ
పెళ్లికి ముందుకు చైతూ .. సమంత కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. పెళ్లి తరువాత ఈ జంటను తెరపై చూడటానికి అభిమానులంతా ముచ్చటపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి దర్శకుడు శివ నిర్వాణ రంగంలోకి దిగాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది.

నిన్నమొన్నటి వరకూ చైతూ .. సమంత విదేశాల్లో ఉండటంతో, ఇతర పాత్రలకి సంబంధించిన సీన్స్ ను చిత్రీకరిస్తూ వచ్చారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన చైతూ .. సమంత తాజాగా ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో, చైతూ .. సమంత భార్యాభర్తలుగా కనిపించనుండటం విశేషం. క్రేజీ కాంబినేషన్ కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *