శ్రీ దుర్గాదేవిగా సంతోషిమాత

అక్షిత బ్యూరో, సూర్యాపేట : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని సంతోషిమాత దేవాలయం లో శ్రీ సంతోషి మాత అమ్మవారు శ్రీ దుర్గాదేవి గా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ దుర్గా దేవి అలంకరణ దాతలకు ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా చండీ హోమం,రుద్ర హోమం, నిర్వహించారు.అమ్మవారికి ప్రత్యేకంగా గులాభిలతో అర్చనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.కొబ్బరికాయలు,రవికలు,చీరలు అమ్మవారికి సమర్పించారు.. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకావెంకటేష్ గుప్త, బ్రాహ్మ0డ్లపల్లి మురళీధర్ ఉత్సవ కన్వీనర్లు నరేంద్రుని విద్యాసాగర్ రావు,పబ్భా ప్రకాశరావు,కో కన్వీనర్లు నామి రెడ్డి పాపిరెడ్డి బోనగిరి విజయ్ కుమార్,కమిటీ సభ్యులు బ్రాహ్మ0డ్లపల్లి సంతోషకుమార్,దేవిదత్తు, అర్చకులు వీరభద్ర శర్మ బాబ్జి శర్మ, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
నేడు మహిషాసుర మర్దిని దేవిగా సంతోషి మాత
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సంతోషిమాత మహిషాసురమర్దిని దేవిగా భక్తులకు దర్శన మివ్వనున్నట్లు దేవాలయ అధ్యక్షులు నూకా వెంకటేశం గుప్తా తెలిపారు.

 

 

tags : durgadevi, srpt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *