శ్రీకాంతచారి జయంతి

అక్షిత ప్రతినిధి, హుజూర్ నగర్ : మలిదశ తెలంగాణ ఉద్యకారుడు, తెలంగాణ రాష్ట్ర కోసం ప్రాణత్యాగాన్ని చేసిన అమరుడు శ్రీకాంతచారి జన్మదినాన్ని స్థానిక ఆర్ అండ్ బీ అతిధి గృహంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆపార్టీ నాయకుడు కోట రామారావు మాట్లాడుతూ శ్రీకాంతచారి త్యాగం తెలంగాణ సమాజం ఎప్పటికి మరచిపోదని అన్నారు. తన చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్రం సిద్దించాలని అగ్నితో పోరాడిన వీర అమరుడు శ్రీకాంత చారి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు శ్రీనివాస్, రామరాజు, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, సత్యం, అశోక్, నాగేంద్ర చారి,నవీన్, నరేందర్,శివ, హరీష్,గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

 

 

tags : srikanthchary, kota ramarao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *