శ్రమిస్తే విజయం తథ్యం

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్: ప్రతి ఒక్కరి జీవితంలో మంచిచెడులు ఉంటాయి. వాటిని దాటుకొని ముందుకెళ్లాలి. కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా ఫలితం దక్కుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పహిల్వాన్ చిత్రాన్ని అందరికి స్ఫూర్తినిచ్చే కథాంశంతో రూపొందించారు అని చెప్పింది ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత పి.వి.సింధు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన పహిల్వాన్ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరైంది. పహిల్వాన్ తొలి టికెట్‌ను పి.వి.సింధు, సీనియర్ దర్శకుడు బోయపాటి శ్రీను ఖరీదు చేశారు. కన్నడ హీరో సుదీప్ టైటిల్‌రోల్‌ని పోషించిన ఈ చిత్రానికి ఎస్.కృష్ణ దర్శకుడు. వారాహి చలన చిత్రం పతాకంపై సాయికొర్రపాటి తెలుగులో ఈ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ముఖ్యంగా ఈగ చిత్రం చిరకాలం నా హృదయంలో నిలిచిపోతుంది. ఎంతో కష్టపడి చేసిన పహిల్వాన్ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను అని సుదీప్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కథానాయిక ఆకాంక్షసింగ్, ఎస్ కృష్ణ, రామజోగయ్య శాస్త్రి, కబీర్‌దుహన్‌సింగ్, చాముండేశ్వరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *