శోభాయమానంగా వినాయక చవితి

అక్షిత ప్రతినిధి, హుజూర్ నగర్ : వినాయక చవితి పండుగని పురస్కరించుకుని మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల ప్రతిష్ఠ హుజూర్ నగర్ మెయిన్ రోడ్ లో ఊరేగింపు కార్యక్రమం అత్యంత శోభాయమానంగా కనుల పండుగగా నిర్వహించారు.పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి నుండి పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు భారీ ఊరేగింపు కోలాటాలు మంగళవాయిద్యాలతో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ దాతగా 36 విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమానికి హుజూర్నగర్ పట్టణంలోని అన్ని వార్డుల నుంచి భక్తజన సందోహంగా భక్తులు మరియు నాయకులు భారీ సంఖ్యలో యువత హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో రోటరీక్లబ్ అధ్యక్షుడు కోతి సంపత్ రెడ్డి, నాయకులు కడియాల రామకృష్ణ, అట్లూరి హరిబాబు, బెల్లంకొండ అమర్, కోలపూడి దయాకర్ గంగరాజు, గోపి, శీలం సైదులు, నరసింహరావు, బెల్లంకొండ చిరంజీవి, నాగరాజు, హరి, శ్రవణ్ పాల్గొన్నారు.

 

 

tags : ganesh, donthagani srinivas goud, hnr

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *