అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, ప్రస్తుతం తెలంగాణలో అభివృద్ధితో పాటు శాంతి భద్రతలు కొలకొన్నాయని అన్నారు. అందుకే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతోందని హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన పోలీస్ మెడల్స్ ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనన్ని నిధులు కేసీఆర్ పోలీస్‌శాఖకు ఇచ్చారని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో తెలంగాణ పోలీసులు అత్యున్నత స్థాయిలో ఉన్నారని కితాబుఇచ్చారు. పోలీసు ఉద్యోగం అంటే ఇతర ఉద్యోగాల మాదిరి కాదని కుటుంబ పరిస్థితులను లెక్కచేయకుండా అత్యంత ప్రతి కూల పరిస్థితుల్లో తీవ్ర వాదాన్ని , ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో తెలంగాణ పోలీస్ ముందంజలో ఉందని మంత్రి అభినందించారు.
tags : homeminister, dgp, telangana