శబరిమల ఆలయం మూతపడుతుందా?

శబరిమల ఆలయం మూతపడుతుందా?

శబరిమల ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తారా? అయ్యప్ప భక్తులను ప్రస్తుతం కలవరపెడుతున్న ప్రశ్న ఇదే. వివరాల్లోకి వెళ్తే, ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈరోజు నెలవారీ పూజలు చేసే క్రమంలో ఆలయ ద్వారాలను తెరవనున్నారు. సాధారణంగా ప్రతి నెల ఐదు రోజుల పాటు భక్తులకు అయ్యప్ప దర్శనం ఉంటుంది. మరోవైపు, ఆలయంలోకి ప్రవేశించేందుకు ఇప్పటికే పలువురు మహిళలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు అనుమతి ఉండదు. పొరపాటున తెలియక ఎవరైనా ఆలయంలోకి ప్రవేశించినా… ఆలయ సంప్రదాయాలను అనుసరించి పుణ్యాహవచనం (ఆలయ శుద్ధి) చేస్తారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మహిళలను అనుమతిస్తే… ప్రతిరోజు అనేకసార్లు ఆలయాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి ఇలా చేయడం అసాధ్యం. దీంతో, ఆలయాన్ని నిరవధికంగా మూసివేయాలనే ఆలోచనలో ప్రధాన పూజారి, రాజకుటుంబం ఉన్నాయని పందళం రాజకుటుంబ ప్రతినిధి శశికుమార్ వర్మ తెలిపారు. దీనికితోడు ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే.. పూజ నిర్వహించకుండా నిరసన తెలిపేందుకు ప్రధాన పూజారి కందరారు మహేశ్వరారు సిద్ధమయ్యారని సమాచారం. ఈ ఉత్కంఠ మరెన్ని మలుపులు తీసుకోబోతోందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *