వ్యాయమంపై దృష్టి సారించాలి: రకుల్‌

అక్షిత ప్రతినిధి, విశాఖ: శరీర ఆరోగ్యానికి, దృఢత్వానికి వ్యాయామం ఎంతో అవసరమని, యువత ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని ప్రముఖ సినీనటి‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. అక్కయ్యపాలెం పోర్టు కళావాణి ప్రాంగణంలో శనివారం 5ఏఎమ్ క్లబ్‌, రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 555కె వాక్‌ ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రకుల్‌ మాట్లాడుతూ.. నేటి సమాజంలో బాలలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పత్రికలలో వస్తున్న వార్తలు చూస్తుంటే భయం వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 5ఏఏమ్‌ క్లబ్‌ వ్యవస్థాపకులు కేవీటీ రమేష్‌, ఆంధ్రప్రదేశ్‌ జేఏసీ అధ్యక్షుడు ఆడారి కిషోర్‌కుమార్‌, ఆర్‌సీవీసీ అధ్యక్షురాలు రాధికసతీష్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *