వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్

అక్షిత ప్రతినిధి, నల్గొండ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. గౌరవ్ ఉప్పల్ తెలిపారు. నేడు జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్ ఉదయం 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ, గొరవ వందనం స్వీకరించనున్నారు. 10.10 గంటలకు జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి పై శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ప్రసంగం, 10.30 గంటలకు.పుర ప్రముఖుల పరిచయం, 10.40, బాల బాలికల సాంస్కృతిక విన్యాస కార్యక్రమాలు సంబరాలను,11.10 వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ,11.30 ప్రోత్సాహక బహుమతుల ప్రదానం,12.30 వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ శాఖల ద్వారా ఆస్తుల పంపిణీ ,12.45 జాతీయ గితాలాహన కార్యక్రమం వుంటుందని అన్నారు.
అంబేద్కర్ ఆడిటోరియం లో ….
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా నేడు
సాయంత్రం 6.30 గంటలకు అంబెడ్కర్ ఆడిటోరియం (ఎస్.పి. టి.మార్కెట్ ఎదురు) జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులచే జాతీయ సమగ్రత,సమైక్యత ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా.లోని ప్రజలు,కలాభి మానులు,పుర ప్రముఖులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.

 

tags : Collector, nalgonda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *