వృద్ధులు, వికలాంగులకు వ్యాక్సినేషన్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, వృద్ధులు, వికలాంగుల వ్యాక్సినేషన్ కై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బన్సిలాల్‌పేట్‌లోని వృద్ధాప్య గృహాన్ని సందర్శించి మొబైల్ వ్యాన్‌లకు పచ్చ జండా ఊపి వ్యాక్సినేషన్ ను ఆదివారం ప్రారంభిచారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ వృద్ధాప్య గృహాల్లో ఉంటున్న వృద్ధులు, వికలాంగులకు టీకాలు వేయడానికి ఈ రోజు నుంచి 24 మొబైల్ మెడికల్ వ్యాన్ ల ద్వారా వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందని, మొబైల్ యూనిట్‌లో డాక్టర్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం ఉంటారని తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు టీకాలు వేస్తున్న టీకా కేంద్రాన్ని కూడా ప్రధాన కార్యదర్శి పరిశీలించారు.రాష్ట్రవ్యాప్తంగా 19 ఉచిత డయాగ్నొస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.3వ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఆస్పత్రులలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మానవ వనరులను బలోపేతం చేయడం, సామర్థ్యం పెంపొందించడం, హై ఎక్స్ పోజర్ గ్రూపులకు టీకాలు వేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం జరుగుతుందన్నారు. అనంతరం కోఠిలోని యూనియన్ (ఆంధ్ర )బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ప్రారంభించారు, అక్కడ బ్యాంక్ ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. వివిధ ప్రయివేట్ హాస్పటల్స్ ద్వారా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినందుకు జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య ఇతర బ్యాంకు అధికారులను ప్రధాన కార్యదర్శి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *