ఖమ్మం మహిళా ప్రాంగణలో వృత్తి విధ్య శిక్షణకి దరఖాస్తులు ఆహ్వానం
-పోటీ పరీక్షలకి సైతం ఉచిత శిక్షణ వసతి
-మహిళా ప్రాంగణ అధికారిణి
విజేత వెల్పుల
అక్షిత/ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరం టేకులపల్లిలో గల మహిళా ప్రాంగణలో వృత్తి విధ్య శిక్షణకి మరియు పోటీ పరీక్షలకి సిద్దమైయ్యో ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మహిళా అభ్యర్దుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళా ప్రాంగణ అధికారిణి విజేత వెల్పుల ఓ ప్రకటనలో తెలిపారు. వృత్తి విధ్య శిక్షణలో కంప్యూటర్ కోర్స్ మగ్గం వర్క్ టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ బ్యూటిషియన్ చీరల అద్దకంలో ట్రైనింగ్ అగర్ వత్తులు పినాయిల్ తయారి వంటి వృత్తి విధ్య కోర్సులు 45 రోజుల నుండి 90 రోజులు ట్రైనింగ్ ఉంటుందని ఈ శిక్షణకి 5 వ తరగతి నుండి 10 వ తరగతి ఉతీర్ణత సాదించిన మహిళా అభ్యర్దులు ఈనెల 24 వ తేదీ లోపు దరఖాస్తులు చేయాలని తెలిపారు.పోటీ పరీక్షలు ఎస్సై కానిస్టేబుల్ డీయస్సీ గ్రూప్ 1,2 & 3 వంటివి ప్రిపేరయ్యె వారికి సైతం ఉచిత శిక్షణ మరియు వసతి కల్పించబడునని ఆసక్తి గల అభ్యర్దులు ఆధార్ కార్డు విధ్యార్హత పత్రాలు కుల ఆధాయ దృవీకరణ పత్రాలతో మహిళ ప్రాంగణం ఆఫీస్ లో సంప్రదించాలన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని యువతులు మహిళలు ఈ అవకాశాన్ని సధ్వినియోగం చేసుకోవాలని మహిళ ప్రాంగణ అధికారిణి విజేత వెల్పుల కోరారు.