విలపించిన శివన్.. ఓదార్చిన మోదీ

అక్షిత ప్రతినిధి, హైద‌రాబాద్‌: ఇవాళ ఉద‌యం ఇస్రో సెంట‌ర్‌లో భావోద్వేగ క్ష‌ణాలు క‌నిపించాయి. నిరాశ‌లో ఉన్న శాస్త్ర‌వేత్త‌ల‌కు సంఘీభావంగా ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగం చేశారు. చంద్ర‌యాన్‌2కు చెందిన విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఆచూకీ చిక్క‌క‌పోవ‌డంతో ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు తీవ్ర నిరాశ‌లో ఉన్న‌ట్లు క‌నిపించింది. జాతిని ఉద్దేశించిన ప్ర‌సంగించిన త‌ర్వాత మోదీ.. ఇస్రో సెంట‌ర్‌లో ఉన్న శాస్త్ర‌వేత్త‌లు, ఇంజినీర్లు, టెక్నీషియ‌న్ల‌తో క‌ర‌చాల‌నం చేశారు. అన్ని గ్యాల‌రీల‌ను తిరుగుతూ వారిని ప‌ల‌కరించారు. ప్ర‌తి ఒకరికి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. అయితే ఇస్రో సెంట‌ర్‌ను వ‌దిలి తిరిగి బ‌య‌ట‌కు వెళ్తున్న స‌మ‌యంలో చైర్మ‌న్ శివ‌న్ భావోద్వేగానికి లోన‌య్యారు. వీడ్కోలు చెప్పేందుకు వ‌చ్చిన శివ‌న్ క‌న్నీరు పెట్టుకున్నారు. దీంతో ప్ర‌ధాని మోదీ.. శివ‌న్‌ను ఓదార్చారు. గుండెకు హ‌త్తుకుని ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు. ఎన్నో రాత్రులు అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న సైంటిస్టుల‌కు మోదీ జోహార్లు ప‌లికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *