వినాయక నిమజ్జన ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ

చింతలపాలెం, సెప్టెంబర్07, అక్షిత న్యూస్ : వినాయక నిమజ్జనం జరిగే బుగ్గ మాధారం నది పరివాహక ప్రాంతాలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు శనివారం సందర్శించారు. చుట్టూ పరిసరాలను ఈ సందర్బంగా మాట్లాడుతూ నిమజ్జనం జరుగు చుట్టూ ప్రదేశాలకు భారీ బారికేడింగ్, లైటింగ్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, నిమజ్జనం చేయడానికి క్రేన్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. గణేష్ నిమజ్జనానికి వచ్చే ఆర్గనైజర్లు, వాలంటీర్లు పోలీసు వారి సలహాలు సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం చేయాలని తెలిపారు.పోలీసులు సూచించిన పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్ చేయాలని సందర్శకులకు తెలిపారు. వాహనాలు పార్క్ చేసే ప్రదేశాలలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. నిమజ్జనం ప్రాంతాల్లో నిమజ్జనం ఊరేగింపు జరిగి ప్రదేశాలలో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గణేష్ నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మరమ్మతులు చేపట్టాలని అధికారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సీఐ, తహశీల్దార్లు, ప్రత్యేక అధికారులు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

 

 

tags : ganesh, shobhayatra, collector, sp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *