వినాయకుని పండగను ఆన0దోత్సహాలతో జరుపుకోవాలి : పావని కృపాకర్

అక్షిత బ్యూరో, సూర్యాపేట : వినాయకుని పండుగను తొమ్మిది రోజుల పాటు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని జిల్లా తెరాస మహిళ నాయకురాలు,మాజీ కౌన్సిలర్ గండురి పావని కృపాకర్ అన్నారు.సోమవారం వినాయక చవితి సందర్భముగా 2 వార్డ్ లో నెలకొలిపిన మట్టి వినాయకుని విగ్రహంవద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తముగా జరుపుకొనే పండుగ వినాయకుని పండుగ అని అన్నారు.21 రకముల పత్రి తో తొమ్మిది రకముల పిండి వంటలతో జరుపుకొనే పండుగ ఒక్క వినాయకుని పండుగ అని అన్నారు.వాడ వాడ ల వినాయకుని విగ్రహములు ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు నిర్వహించుకొని అనంతరం వినాయకుని నిమజ్జనం చేస్తారని అన్నారు.ఈ తొమ్మిది రోజుల పాటు ప్రశాంత వాతావరణం లో భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని కోరారు. అంతకు ముందు ఆమే నివాసము ను0డి వినాయకుని ఉత్సవ విగ్రహాన్ని మేళా తాళాలతో శోభాయాత్ర గా తీసుకవచ్చి వినాయకుని మండపం వద్ద పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు గ0డురి కృపాకర్ 2 వార్డ్ ప్రజలు సవరాల సత్యనారాయణ, దేవిరెడ్డి రవిందర్ రెడ్డి,రాచకొండ శ్రీనివాసు,కందిబండ రమేశ్,బజ్జురి శ్రీనివాసు,మిట్టపల్లిరమేష్,కందిబండ సూరయ్య,వా0కుడోతు వెంకన్న పద్మ,సంగిశెట్టి వెంకటేష్, ఉప్పల నరసయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

tags : ganduri, srpt , ganesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *