వరద కాలువ నీటితో కుక్కడం చెరువు నింపాలి : శ్రీనివాస్ రెడ్డి

మాడ్గులపల్లి, అక్షిత ప్రతినిధి : ఎలిమినేటి మాధవ రెడ్డి ప్రాజెక్టు,వరద కాలువపై తూమును ఏర్పాటు చేసి కుక్కడం చెరువును నింపాలని గండ్రవానిగూడెం సర్పంచ్ చింతకుంట్ల. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మాడ్గులపల్లి మండలంలోని గండ్రవానిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుక్కడం ఎంపీటీసీ బట్టు. రాధ మాధవరెడ్డి తో కలిసి ఆయన మాట్లాడుతూ రెండువందల పన్నెండు ఎకరాల విస్తీర్ణంకలిగి ఉన్న కుక్కడం చెరువును నీటితో నింపడానికి ప్రత్యేక తూము ఏర్పాటు చేయకపోవడంతో వరద కాలువ నీరు అందని ద్రాక్షల మారిందన్నారు. దీనితో చెరువు ఆయకట్టు తోపాటు చుట్టుపక్కల భూగర్భజలాలు అడుగంటి రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎప్పటికైనా అధికారులు వరద కాలువపైప్రత్యేక శాటర్ ఏర్పాటు చేసి చేరువులోకి నీరు వచ్చే ఏర్పాటు చేయాలని కోరారు. ఈసమావేశంలో ఉప సర్పంచ్ బొబ్బిలి. నాగలక్ష్మి నరేష్,కొనతం.వెంకట్ రెడ్డి, నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

 

 

tags : amrp water, madgulapally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *