అక్షిత ప్రతినిధి, విజయవాడ: దసరా పండుగ నేపథ్యంలో రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధరను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్లాట్ ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి 30 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 10వ తేదీ వరకూ పెంచిన ప్లాట్ఫామ్ టికెట్ ధర అమలులో ఉండనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
గతంలో పండుగల వేళ ఉండే రద్దీ దృష్ట్యా రూ.10 ఉన్న ప్లాట్ఫాం టికెట్ ధరను 20 రూపాయలకు పెంచేవారు. ఇప్పుడు ఏకంగా 30 రూపాయలకు పెంచడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. పెంచిన ప్లాట్ఫాం టికెట్ ధరలు విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు రైల్వే స్టేషన్లలో అమలులో ఉండబోతున్నట్లు తెలిసింది.