రైతు సమన్వయ సమితుల బలోపేతం : సీఎం కేసీఆర్

అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : రైతు సమన్వయ సమితులను మరింత బలోపేతం చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ శాసనసభలో సభ్యులడిగిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖా మంత్రి నాయకత్వంలో రైతు సమన్వయ సమితిలు క్రియాశీలకంగా పనిచేస్తాయనీ, రైతు సమన్వయ సమితి చేసే పని ఇప్పుడు మొదలవుతుందని ఆయన అన్నారు. మన రాష్ట్రలో పండే ప్రధాన పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, మిగితా పంటలు, పూలు, కూరగాయ పంటలు ఉన్నప్పటకీ వాటిని తక్కువ మోతాదులోనే పండిస్తారు. పసుపు, మిర్చి పంటల విషయంలో కొన్ని సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామని సీఎం అన్నారు. డీలర్ల వ్యవస్థను పటిష్టం చేసి, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ మెరుగుపరుస్తామని ఆయన అన్నారు. మన అవసరాలకు తగిన ఫుడ్ ప్రాసెసింగ్ జరగాలని, తాజా కూరగాయలు ప్రజలకు అందాలంటే కొత్త వ్యవస్థ ఏర్పడాలని ఆయన అన్నారు. ప్రజా సరుకుల పంపిణీ ద్వారా స్వచ్చమైన ఆహార పదార్థాలు అందించాలన్నారు. ముంబయిలో విజయ పాల ఉత్పత్తులకు బాగా డిమాండ్ ఉంది. కొందరు దుర్మార్గులు వాటిని కూడా కల్తీ చేస్తున్నారు. అలాంటి దుర్మార్గుల ఆగడాలను అరికట్టాలని సీఎం తెలిపారు. త్వరలోనే రైతు సమన్వయ సమితి కొత్త అధ్యక్షుడిని నియమిస్తాం అని, సమితి ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తాం. కొందరు పిల్లలకిచ్చే పాలు సైతం కల్తీ చేస్తున్నారనీ, వీటన్నింటినీ అరికట్టేందుకు మహిళా సంఘాల సాయం తీసుకుంటాం. వారికి తోడుగా ఐకేపీ కూడా ఉంటుంది. డీలర్లు ఉన్న చోట ఖాళీలు భర్తీ చేస్తాం. కొన్ని చోట్ల అప్పుడప్పుడూ బియ్యం పట్టివేత అనే వార్తలు చూసినపుడు భాద కల్గుతుందనీ, డీలర్లకు కమీషన్‌లు తగు రీతిలో పెంచి ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్టవేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

 

 

 

tags : cm kcr, raithu ss, assembly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *