రైతు ఏడిస్తే… రాజ్యం బాగుపడదు

కొత్త చట్టాలతో… రైతులకు నష్టం
రైతులకు అండగా టీఆర్ఎస్
వేములపల్లిలో బంద్, రాస్తారోకో
కట్టా మల్లేష్ గౌడ్

వేములపల్లి, అక్షిత ప్రతినిధి : కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుందని టీఆర్ఎస్ జిల్లా కట్టా మల్లేష్ గౌడ్ అన్నారు. ఆయా చట్టాల రద్దును కోరుతూ ఈ నెల 8న తలపెట్టిన దేశ వ్యాప్త బంద్ ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సోమవారం వేములపల్లి మండలంలోని శెట్టిపాలెంలో విలేఖర్లతో మాట్లాడుతూ దేశానికి వెన్నుముక రైతు…వ్యవసాయం అభివృద్ధి చెందితినే అనేక రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు.పారిశ్రామిక సేవా రంగాలలో తన ఉత్పత్తికి తానే ధర నిర్ణయించుకునే అధికారం వాళ్లకు ఉండగా.. వ్యవసాయం చేసే రైతుకు తన పంటకు తానే ధర నిర్ణయించుకునే అధికారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు అప్పులపాలు అవుతున్న పరిస్థితుల్లో రైతులు పండించిన పంట అమ్మకాలకు గొడ్డలి పెట్టులాంటి చట్టాలతో రైతులకు మరింత నష్టం జరుగుతుందని అన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా రైతులు గత 12 రోజులుగా ఆందోళనకు దిగారన్నారు.సమ్మెను సామాజిక కోణంలో ఆలోచించి ప్రభుత్వాలు రైతులకు తగిన విధంగా న్యాయం చేసేందుకు చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్య పంజాబ్, హర్యానా రైతులకే కాకుండా దేశంలో ఉన్నటువంటి రైతులందరి సమస్యగా గుర్తించాలని, పంజాబ్, హర్యానా, ఢిల్లీ సమీపంలో ఉండటం వల్ల రైతులు అక్కడికి రాగలిగారని, కానీ దేశవ్యాప్తంగా ఉన్న రైతులు దూర ప్రాంతానికి రాలేక వారి యొక్క నిరసనను ఆయా రాష్ట్రాలలో కొనసాగిస్తున్నారన్నారు. రైతు చేస్తున్నటువంటి పోరాటంలో న్యాయాన్యాయాలు పరిశీలించి, తగిన విధంగా చట్టాన్ని వెనక్కి తీసుకో వలసిన అవసరం ఉందన్నారు. రైతులు చేపట్టిన బంద్ కు సీఎం కేసీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా..రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. రుణ మాఫీ,24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు పేరిట పెట్టుబడి సాయం, రైతు బీమా తదితర పథకాలతో రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు … కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. రైతులు తలపెట్టిన బంద్ ను విజయవంతం చేసేందుకు సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మిర్యాలగూడ ఎం ఎల్ ఏ నలమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు. వ్యవసాయరంగాన్ని కార్పోరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకే చేపట్టిన కుట్రలో భాగంగానే కొత్త చట్టాల రూపకల్పనగా మండిపడ్డారు. రహదారులను దిగ్బంధం చేసి రైతుల ఆందోళనకు భరోసాగానిలువాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, వ్యాపార, వాణిజ్య వర్గాలు, కార్మికులు తదితర అన్ని వర్గాలు బంద్ కు సహకరించాలని ఆయన కోరారు. పార్టీ పిలుపు మేరకు వేములపల్లి మండల కేంద్రంలో మంగళవారo ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు చేపట్టనున్న రాస్తారోకోకు మండలంలోని రైతులంతా అధిక సంఖ్యలో హాజరై బంద్, రాస్తారోకోను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అద్యక్షులు గౌరు శ్రీనివాస్, మాజీ సింగిల్ విండో చైర్మన్ కాట్రగడ్డ రాజ గోపాల్ రావు, కట్టా వెంకటయ్య, బంటు దుర్గా ప్రసాద్, బంటు రామన్న, శిరస్సు శ్రీనివాస్, మోరుసు వెంకటయ్య, బంటు ప్రసాద్, రాచూరి వెంకన్న, పల్లా శ్రీను తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *