రేవంత్ కు సుప్రీంలో ఊరట

న్యూఢిల్లీ, అక్షిత ప్రతినిధి :

సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌పై ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యే వరకు సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిలిపివేయాలని జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత ధర్మాసనం తెలంగాణ ఏసీబీని ఆదేశించింది. 4 వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నాంపల్లిలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక న్యాయస్థానంలో గురువారం ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఎంపీ రేవంత్‌రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్‌, ఉదయ్‌సింహ, మత్తయ్య జెరూసలేం, వేం కృష్ణకీర్తన్‌(వేం నరేందర్‌రెడ్డి తనయుడు)పై అభియోగాలు నమోదు చేసింది.  నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు లంచంగా ఇవ్వజూపిన రూ.50 లక్షలను జప్తు చేసినట్టు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *