రేపటి నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవములు

అక్షిత బ్యూరో, సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని  శ్రీ సంతోషిమాత దేవాలయం లో ఈనెల 29  ఆదివారం నుంచి అక్టోబర్ 8  మంగళవారం వరకు పది రోజుల పాటు దేవి శరన్నవరాత్రులు నిర్వహించేందుకు అన్ని  ఏర్పాట్లు చేసినట్లు దేవాలయ అధ్యక్ష, కార్యదర్శులు నూక వెంకటేష్ గుప్తా, బ్రాహ్మ0డ్ల పల్లి మురళీధర్ తెలిపారు. శుక్రవారం దేవాలయంలోని ఆధ్యాత్మిక గ్రంథాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను కమిటీ సభ్యులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ  నవరాత్రులు ప్రతిరోజు ఉదయం చండీ హోమం, సాయంత్రం రుద్రహోమం ప్రత్యేక కుంకుమార్చన లతోపాటు భవానీ దీక్షలు, చిన్నారులకు  అక్షరాభ్యాసాలు, సరస్వతి పూజ లు, దేవత వేష ధారణ పోటీలు, అన్నదానం,కవి సమ్మేళనం తో పాటు  పసుపుకొమ్ములు పూజ, గాజుల పూజ, లక్ష పుష్పార్చన బిల్వార్చన, సుగంధద్రవ్యాలతో పాటు శ్రీ సంతోషిమాతకు  తెనాలి వారిచే  వివిధ అలంకరణలు చేయనున్నట్లు తెలిపారు. మొదటిరోజు మంగళ గౌరీ దేవి, రెండోరోజు బాలా త్రిపుర సుందరి దేవి, మూడవ రోజు గాయత్రీదేవి ,నాలుగో రోజు అన్నపూర్ణాదేవి, ఐదొవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, ఆరవ రోజు మహా లక్ష్మీదేవి, ఏడవ రోజు సరస్వతి దేవి, ఎనిమిదో రోజు దుర్గాదేవి తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర మర్ధిని దేవి, 10వ రోజు విజయదశమి రోజున రాజరాజేశ్వరి దేవి తో పాటు   జమ్మిగడ్డ లోని మండల పరిషత్ కార్యాలయంలో కైలాశ శంకరులు స్టేజి  అలంకరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు, దసరా రోజున సాయంత్రం నిర్వహించే శమీపూజ లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తో పాటు వివిధ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఉత్సవ కన్వీనర్లు నరేంద్రుని విద్యాసాగర్ రావు,పబ్భా ప్రకాష్ రావు, కమిటీ సభ్యులు సోమ శ్రీశైలం, యామా వెంకటేశ్వర్లు గుండెటి శ్రీధర్, బ్రాహ్మ0డ్లపల్లి నాగమణి,బచ్చు నీరజ,దేవాలయ మేనేజర్ బచ్చుపురుషోత్తం  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *