అక్షిత ప్రతినిధి, హైదరాబాద్ : వచ్చే రబీ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేస్తామని, దీని కోసం మార్క్‌ఫెడ్, సొసైటీలలో , డీలర్ల వద్ద సరిపడా నిల్వలు ఉంచుతున్నట్టు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి తెలిపారు. శుక్రవారం ఆయన వ్యవసాశాఖ, మార్క్‌ఫెడ్ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో వేసిన రైతువారీ, పంటలవారీ(రకాల వారీగా) గ్రామవారి సమాచారాన్ని సేకరించి ఆన్లైన్లో పొందుపర్చాలని అధికారులకు సూచించారు. తమ పరిధిలోని ప్రతి డీలర్‌షాపులు సందర్శించి ఎరువుల లభ్యతను తనిఖీ చేయాలని, పీవోఎస్ మెషిన్లోని స్టాక్, రిజిస్టర్‌లోని స్టాకు, షాపులో ఉన్న స్టాక్‌లలో తేడా లేకుండా సరిచూసుకోవాలని అన్నారు. ప్రతి జిల్లాలో రేక్, రోడ్ ద్వారా వచ్చే స్టాక్‌ను రేక్‌పాయింట్ అధికారి, రేక్‌పాయింట్ జిల్లా అధికారి, రేక్పాయింట్లోని జిల్లా అధికారులు సమన్వయంతో స్టాక్ సరఫరాను పర్యవేక్షించుకోవాలన్నారు. స్టాక్చేసిన వివరాలను ఎప్పటికప్పుడు కమిషనరేట్‌కు తెలియజేయాలన్నారు. వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్‌బొజ్జా మాట్లాడుతూ ఖరీఫ్-2019, అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ముందస్తుగా , గ్రామ వారి ఎరువుల అవసారాన్ని అంచనా వేసుకుని ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని అన్నారు.రోజువారీ ఎరువుల స్టాక్ రిపోర్ట్‌ను తప్పకుండా కమిషనర్ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.
tags : rabhi, fertilisers, parthasaradhi